![]() |
![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ ఆదివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో ఒక వెరైటీ సెగ్మెంట్ ని కండక్ట్ చేసింది శ్రీముఖి. అదే కంప్లైంట్ బాక్స్. ఈ షోకి వచ్చిన పార్టిసిపెంట్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ కంప్లైంట్స్ ని ఈ బాక్స్ లో వేస్తే శ్రీముఖి వాటిని తీసి చదివింది. ఈ షోకి అమర్ దీప్ వాళ్ళ అమ్మతో, సుహాసిని వాళ్ళ అత్తగారితో, సాకేత్ కొమాండూరి వాళ్ళ చెల్లితో, బోలె షావలి తన కూతురితో, అంబటి అర్జున్ ఫ్రెండ్ ఐశ్వర్యతో, ఆట సందీప్ తన వైఫ్ తో వచ్చారు. "పేరెంట్స్ మీటింగ్ కి మా నాన్న వచ్చేవాడు కాదు..అసలు ఎం చెప్పినా వినడు. ఇక నుంచి మా డాడీ మా మాట వినాలని" అంటూ భోలే షావలి కూతురు కంప్లైంట్ చెప్పేసరికి "ముందు నువ్వు కాలేజీ కి బంక్ కొట్టకుండా వెళ్ళు" అన్నాడు.
తర్వాత "నా కోడల్ని నేను, వాళ్ళ అమ్మ అడిగేది ఒక్కటే. ఒక్కసారైనా మార్కెట్ కి వెళ్లి ఒక కేజీ కూరగాయలు కొనుక్కుని రావాలని మా కోరిక" అని చెప్పింది సుహాసిని వాళ్ళ అత్తగారు. "నా కొడుకు ఆర్టిస్ట్ అవ్వాలని అనుకున్నా..అయ్యాడు కానీ ఎప్పుడూ నన్ను షూటింగ్ కి తీసుకెళ్లలేదు. షూటింగ్ స్పాట్ చూడాలని ఉంటుంది" అని అమర్ దీప్ వాళ్ళ అమ్మ అడిగేసరికి తప్పకుండా తీసుకెళ్తానని ప్రామిస్ చేసాడు. "మా అన్నయ్యకు నేనంటే చాల ఇష్టం. అంత ఇష్టం ఐనప్పుడు నా పాకెట్ మనీని ఎందుకు దొంగతనం చేస్తాడు. పెళ్లయ్యాక కూడా నా పాకెట్ మనీ కొట్టేసి దాంతో ఎం చేస్తాడో తెలీట్లేదు" అంటూ సాకేత్ కొమాండూరి మీద తన చెల్లి సోనీ కంప్లైంట్ ఇచ్చింది. సాకేత్ మాత్రం ఏదేమైనా పర్స్ లోంచి డబ్బులు తీసుకోవడం అస్సలు మానను అని చెప్పాడు.
![]() |
![]() |